8న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మాజీ మంత్రి వర్యులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో షబ్బీర్‌ అలీ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ సిడిసి అధ్యక్షులు కారంగుల అశోక్‌ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం (బిజెపి) అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 8 వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త, యువజన కాంగ్రెస్‌ నాయకులు, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, మహిళా కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here