9నెలల చిన్నారి అత్యాచారం , హత్యకేసులో ఉరి శిక్షకు దోహదం చేసిన సంచలన విషయాలెన్నో !!

0
1


9నెలల చిన్నారి అత్యాచారం , హత్యకేసులో ఉరి శిక్షకు దోహదం చేసిన సంచలన విషయాలెన్నో !!

ప్రతి ఒక్కరి మనసుల్ని ఆవేదనకు గురి చేసిన 9నెలల చిన్నారిపై పాశవిక లైంగిక దాడి, హత్య కేసులో నేరస్తుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు అన్న ఉత్కంఠ కు తెర పడింది. కోర్టు చిన్నారి కేసులో సంచలన తీర్పు వెలువరించింది. కామాంధుడు ప్రవీణ్ కు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జ్ జయకుమార్ ఈ సంచలన తీర్పు వెలువరించారు . కేవలం 48 రోజులలోనే కేసు విచారణ పూర్తి చేసి దోషికి ఉరి శిక్ష విధించి రికార్డు సృష్టించింది వరంగల్ జిల్లా న్యాయస్థానం .

నిందితుడు ప్రవీణ్ తరపున వాదించటానికి ముందుకు రాని న్యాయవాదులు .. బార్ కౌన్సిల్ తీర్మానంపై ప్రజల్లో హర్షం

జూన్ 18 వ తేదీ తెల్లవారుజామున హన్మకొండలో 9 నెలల పసికందు అత్యాచారం,హత్యకు గురవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో కోర్టు తీర్పు కు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ప్రవీణ్ అనే నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 376 ,366, మరియు 5 r/w 6 పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు తరపున కేసును వాదించడానికి ఒక న్యాయవాది ముందుకు రాలేదు. న్యాయవాదులు అంతా నిందితుడి తరఫున కేసు వాదించకూడదని తీర్మానించుకున్నారు. ప్రవీణ్ లాంటి మృగాలకు సహకరించకూడదని బార్ కౌన్సిల్ తీర్మానించిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 9 నెలల పసికందు ను అత్యంత పాశవికంగా లైంగిక దాడి చేసి, హత్య చేసిన ప్రవీణ్ కు శిక్ష పడాలని అన్ని వర్గాలు భావించాయి. ఇక ఈ నేపథ్యంలోనే న్యాయవాదులు ప్రవీణ్ తరఫున ఎవరు వాదించడానికి ముందుకు రాలేదు. న్యాయవాదుల నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

 అరుదైన కేసులో ఇచ్చిన తీర్పు మాత్రమే కాదు పోక్సో చట్ట సవరణ తర్వాత తొలి ఉరి శిక్ష

అరుదైన కేసులో ఇచ్చిన తీర్పు మాత్రమే కాదు పోక్సో చట్ట సవరణ తర్వాత తొలి ఉరి శిక్ష

సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం అరుదైన కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష విధించాలన్న నిబంధన ఉంది. అయితే ఈ ఘటనను అరుదైనదిగా భావించి కోర్టు ఉరిశిక్షను విధించిందని న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాదు చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి ఉరిశిక్ష పడేలా పోక్సో చట్టానికి కీలక సవరణలు చేసి చట్టసవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. జనవరిలో ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లు తరువాత చిన్నారిపై జరిగిన లైంగిక దాడి లో కోర్టు ఉరిశిక్ష వేయడం కూడా ఇదే ప్రథమంగా చెప్పొచ్చు.

వేగంగా పనిచేసిన పోలీసులు .. నేరాన్ని ఒప్పుకున్న నిందితుడు ..

ఇక అంతే కాదు ఈ కేసులో చిన్నారిపై పాశవిక దాడి జరిగి హత్యకు గురైన తరువాత పోలీసులు 20 రోజుల్లోనే నేరానికి సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 51 సాక్ష్యాలను నమోదు చేశారు. కోర్టు అన్ని సాక్ష్యాలను నమోదు చేసింది. అలాగే నిందితుడు ప్రవీణ్ సైతం తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆగస్టు 2 నే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం నేడు సంచలన తీర్పును వెలువరించింది.

సంచలనం రేపిన వరంగల్ కోర్టు వరుస తీర్పులు

సంచలనం రేపిన వరంగల్ కోర్టు వరుస తీర్పులు

వరంగల్ కోర్టు వరుస సంచలనాలను నమోదు చేస్తుంది. మొన్నటికి మొన్న బీజేపీ నేత అశోక్ రెడ్డి హత్య కేసులో 16 మందికి జీవిత ఖైదు విధించిన వరంగల్ కోర్టు, నేడు చిన్నారిపై లైంగిక దాడి హత్య కేసులో ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసును త్వరితగతిని పూర్తి చేయడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ చాలా కృషి చేసింది.

ఒకప్పుడు స్వప్నిక ప్రణీతలపై యాసిడ్ దాడి సమయంలో సంచలన నిర్ణయం తీసుకొని పోలీసులు ప్రేమోన్మాదుల గుండెల్లో వణుకు పుట్టించారు. ఇక తాజాగా 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన లో నేరస్తుడికి ఉరి శిక్ష విధించటం ద్వారా ఇలా చిన్నారులపై పాశవిక దాడులకు పాల్పడే కామాంధుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here