Ala..Vaikunthapurramloo :అల్లు అర్జున్ రేంజ్ ఇది.. దూసుకుపోతున్న రేస్ గుర్రం

0
2


అల్లు అర్జున్ మెగా హీరో గా ఎంట్రీ ఇచ్చి తన స్కిల్‌తో టాప్ హీరోగా ఎదిగాడు. అయితే బన్నీకి గత కొంతకాలంగా అన్ని విషయాల్లో నెగెటివిటీ ఎదురవుతుంది. సరైనోడు సినిమా హిట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. DJ టైమ్‌లో మీడియా మీద ఎదురుదాడి చేస్తే అప్పుడొక రభస జరిగింది. అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుని భారీ బడ్జెట్‌తో నా పేరు సూర్య…నా ఇల్లు ఇండియా సినిమా చేస్తే అది కెరీర్‌లోనే వరస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఇక రీసెంట్‌గా సైరా ఫంక్షన్‌కి రాలేదు అని ఏకేస్తున్నారు. ఇన్ని చిరాకుల్లో కూడా బన్నీకి మంచి బూస్టింగ్ ఇచ్చింది అల…వైకుంఠపురములో సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్.

Also Read: ‘సైరా’ ఫస్ట్ రివ్యూ: ఇతని రేటింగ్‌ని నమ్మలేం

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన మూడో సినిమా ‘అల…వైకుంఠపురములో’లో నటిస్తున్నాడు బన్నీ. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే ఏ సినిమాకి అయినా కూడా సినిమా రిలీజ్‌కి ముందు మంచి ఇంప్రెషన్ కలిగించేది ఆ సినిమా ఆడియో. పైగా అక్కడినుండే సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ కూడా మొదలవుతాయి. స్టార్ హీరోల సినిమాల విషయంలో కీలకమయిన ఓపెనింగ్స్ తీసురావడంలో కూడా ఆడియో కీలకపాత్ర వహిస్తుంది. అలాంటి కీలకమయిన ఆడియో విషయంలో మాత్రం అల…వైకుంఠపురములో సినిమాకి సూపర్ ఛాన్స్ వచ్చింది. ఇంతకుముందు అరవింద సమేత సినిమా కోసం త్రివిక్రమ్‌తో పనిచేసిన థమన్ ఆ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. అదే ట్యూనింగ్‌తో గురూజీతో టీమ్ అప్ అయిన థమన్ అల…వైకుంఠపురములో సినిమాకి మొదటి పాటతోనే అదిరిపోయే టాక్ తీసుకొచ్చాడు.

Also Read: పవన్ కళ్యాణ్ ‘సైరా’ కథ ఇమ్మన్నాడు..రామ్ చరణ్‌కి కూడా నో చెప్పాం

ఈ మధ్య థమన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దాంతో ”నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే న కళ్ళు…” అంటూ సాగిన ఆ పాట ఇప్పుడు అందరికి పట్టేసింది. థమన్ మ్యూజిక్ తోడు సీతారామశాస్త్రి సాహిత్యం కూడా అదుర్స్ అనిపించేస్తుంది. సిద్ శ్రీరామ్ గాత్రంలోని మ్యాజిక్ కూడ జతకలిసి ఆ పాటని ట్రెండింగ్‌లో నిలబెట్టాయి. ఆ పాట రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ 1 ప్లేస్‌కి చేరింది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నేషనల్ వైడ్‌గా కూడా టాప్ 10 లో ప్లేస్ దక్కించుకుంది ‘సామజవరగమన’.

Also Read: పూరీ బర్త్ డే వేడుకలో చార్మి భావోద్వేగం.. ఇస్మార్ట్‌కి ముందు రూ. 50 వేలు కూడా లేవు

అల్లు అర్జున్‌కి తెలుగు స్టేట్స్ తో పాటు కేరళలో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల, కర్ణాటకలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడం వల్ల ఈ పాట నేషనల్ రేంజ్‌లో ట్రెండ్ అవుతుంది. బన్నీ డబ్బింగ్ సినిమాలకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ఆ సినిమాల వ్యూస్ చెబుతాయి. 100 మిలియన్స్ మార్క్ అనేది బన్నీ సినిమాలకు అలవోకగా అందుకునే టార్గెట్‌గా మారింది.అలా విస్తరించిన అల్లు అర్జున్ క్రేజ్ అల…వైకుంఠపురములో సినిమాకి బాగా ఉపయోగపడుతుంది. ఒక్క పాటతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ అల…వైకుంఠపురములో తో హిట్ అందుకుంటే ఈ రేస్ గుర్రం మళ్ళీ టాప్ లీగ్ రేస్ లోకి దూసుకొచ్చినట్టే.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here