BECIL Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 3000 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

0
4



కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 3000 స్కిల్డ్ మ్యాన్‌పవర్, అన్‌-స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. నియామక ప్రక్రియ పూర్తయ్యే సరికి పోస్టుల సంఖ్య మారే అవకాశముంది. 3000 పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ. https://www.beciljobs.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవాళ్లు ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ లిమిటెడ్-PVVNL సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే. 3000 స్కిల్డ్ మ్యాన్‌పవర్, అన్‌-స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టుల భర్తీకి బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే…

మొత్తం ఖాళీలు- 3000 స్కిల్డ్ మ్యాన్‌పవర్- 1500
అన్‌-స్కిల్డ్ మ్యాన్‌పవర్- 1500
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 16

Loading…

డాక్యుమెంట్ వెరిఫికేషన్- సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది.
విధుల్లో చేరాల్సిన తేదీ- అక్టోబర్ 1
స్కిల్డ్ మ్యాన్‌పవర్ విద్యార్హత: ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్‌ కోర్సులో పాస్ కావాలి లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేయాలి. హిందీ, ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
అన్ స్కిల్డ్ మ్యాన్‌పవర్ విద్యార్హత: 8వ తరగతి పాసై ఉండాలి. హిందీ చదవడం, రాయడం, ఇంగ్లీష్ చదవడం తెలిసుండాలి.
వయస్సు: 18 నుంచి 45 ఏళ్లు.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, కేటగిరీ-1 అభ్యర్థులకు రూ.250.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్… ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో టీచర్ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

NABARD Jobs: నాబార్డ్‌లో 91 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here