CA CPT result 2019 : నేడు CA CPT ఫలితాల విడుదల… ఇలా చెక్ చేసుకోండి…

0
7



ఇండియా ఛార్టర్డ్ అకౌంటెట్స్ ఇన్‌స్టిట్యూట్ (ICAI) ప్రకటించే CA కామన్ ప్రొఫీషియన్స్ టెస్ట్ (CPT) ఫలితాలు ఇవాళ అధికారిక వెబ్‌సైట్‌లో రిలీజ్ కాబోతున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం CA CPT 2019 ఫలితాల్ని సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఫలితాలు ప్రకటించాక… ఈ టెస్ట్ రాసిన అభ్యర్థులు… ICAI అధికారిక వెబ్ సైట్ – icai.org లో తమ ఫలితాల్ని చూసుకొని, డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ 2019లో ICAI దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో CA CPTని నిర్వహించింది. ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకున్న అభ్యర్థులు టెస్ట్‌లో పాల్గొని… దాదాపు నెల నుంచీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

CA CPT 2019 ఫలితాలు ఇలా తెలుసుకోండి :
కింది వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. icaiexam.icai.org
caresults.icai.org
icai.nic.in

మొబైల్ ఫోన్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడం ఎలా : అభ్యర్థులు 58888కి మొబైల్ SMS పంపడం ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

Loading…

CACPT (స్పేస్) మీ CPT రోల్ నంబర్

CA CPT 2019 ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా : అభ్యర్థులు ఫలితాలు తెలుసుకోవడానికీ, డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇలా చెయ్యాలి.
1. ICAI అధికారిక వెబ్ సైట్ – icai.org లోకి వెళ్లండి.
2. హోంపేజీలో “Common Proficiency Test result” లింక్ పై క్లిక్ చెయ్యండి.
3. ICAI వెబ్‌సైట్‌లోని మరో కొత్త పేజీలోకి వెళ్తారు.
4. అక్కడ మీరు మీ CPT రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
5. మీ CA CPT ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

CA CPT ఫలితాల్ని ప్రింటవుట్ తీసుకుంటే, ఫ్యూచర్‌లో రిఫరెన్స్ కోసం ఉపయోగపడతాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here