Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ ఉద్యోగాలు… దరఖాస్తు చేయండి ఇలా…

0
0



ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇంటర్ అర్హతతో నావిక్-జీడీ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ కోస్ట్‌గార్డ్. దాంతోపాటు 01/2020 బ్యాచ్ నావిక్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పుడు యాంత్రిక్ 01/2020 బ్యాచ్ పోస్టుల భర్తీ కోసం డిప్లొమా హోల్డర్ల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ విభాగాల్లో యాంత్రిక్ టెక్నికల్ పోస్టులున్నాయి. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 17 లోగా joinindiancoastguard.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

Indian Coast Guard Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే…

యాంత్రిక్ టెక్నికల్ (మెకానికల్) యాంత్రిక్ టెక్నికల్ (ఎలక్ట్రికల్)
యాంత్రిక్ టెక్నికల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్)
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 11
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 17
అడ్మిట్ కార్డ్: 2019 సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8
అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన అర్హతతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ విభాగాల్లో డిప్లొమా 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 18 నుంచి 22 ఏళ్లు

Indian Coast Guard Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా…

ముందుగా www.joinindiancoastguard.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
Careers @ CG ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Careers @ CG ట్యాబ్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి.
ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తిచేయడానికి ముందు గైడ్‌లైన్స్ మొత్తం చదవాలి.
మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ విభాగాల్లో మీకు అర్హతలున్న పోస్టు ఎంచుకోవాలి.
కావాల్సిన సమాచారాన్ని ఎంటర్ చేయడంతో పాటు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.
చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే దరఖాస్తు సబ్మిట్ అవుతుంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్… లుక్స్ అదుర్స్


ఇవి కూడా చదవండి:

SAIL Jobs: స్టీల్ అథారిటీలో 361 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలు ఇవే

Andhra Bank Jobs: ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలు… 10వ తరగతి పాసైతే చాలు

NLC Recruitment 2019: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 875 ఉద్యోగాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here