Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు… 10వ తరగతి పాసైతే చాలు

0
0



పదో తరగతి పాసైనవారికి శుభవార్త. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. డొమెస్టిక్ బ్రాంచ్‌లో నావిక్ (కుక్, స్టివార్డ్) పోస్టుల్ని భర్తీ చేయబోతోంది ఇండియన్ కోస్ట్ గార్డ్. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు https://joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30న ప్రారంభం కానుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 8న ముగుస్తుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. ఇండియన్ కోస్ట్ గార్డ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Coast Guard Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

ఖాళీ ఉన్న పోస్టులు: నావిక్ (కుక్, స్టివార్డ్) విద్యార్హత: 10వ తరగతిలో 50% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు స్పోర్ట్స్‌లో ప్రతిభ సాధించినవారికి 5% సడలింపు.
కుక్: మెనూలో వివరించినట్టు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఆహార పదార్థాలు వండాలి.
స్టివార్డ్: ఆఫీసర్స్ మెస్‌లల్లో వెయిటర్స్, హౌజ్ కీపింగ్, మెయింటెనెన్స్, స్టోర్ హ్యాండ్లింగ్ లాంటి విధులు నిర్వర్తించాలి.
వయస్సు: 18 నుంచి 22 ఏళ్లు

Loading…

వేతనం: రూ.21,700
దరఖాస్తు ప్రారంభం: 2019 అక్టోబర్ 30
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 నవంబర్ 8
ఇ-అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2019 నవంబర్ 17 నుంచి 22

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు… ఖాళీల వివరాలివే

Railway Jobs: వాయువ్య రైల్వేలో ఉద్యోగాలు… ఖాళీల వివరాలివే

SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 296 ఉద్యోగాలు… ఖాళీల వివరాలు తెలుసుకోండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here