ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు… దరఖాస్తు చేయండి ఇలా

0
4



ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-JTO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 200 ఖాళీలున్నాయి. బీఈ లేదా బీటెక్ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. దరఖాస్తు ఫీజు కూడా లేదు. ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది ఈసీఐఎల్. ఇవి ఆరు నెలల కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 19న ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈసీఐఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు: 200 జేటీఓ పోస్టులు దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 19
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30 సాయంత్రం 4 గంటలు
విద్యార్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫస్ట్‌క్లాస్‌లో డిగ్రీ పాస్ కావాలి.
వేతనం: రూ.20,072 + టీఏ, డీఏ

Loading…

వయస్సు: 30 ఏళ్లు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే స్థలం:
Electronics Corporation of India Limited-ECIL,
Nalanda Complex, CLDC, TIFR Road,
Hyderabad – 500 062
Email: hrrect@ecil.co.in / pgrect@ecil.co.in

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 64 జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే

CCL Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 750 ఖాళీలు… వివరాలివే

GSL Jobs: గోవా షిప్‌యార్డ్‌లో జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here