EPFO: ఈపీఎఫ్‌వో అడ్మిట్ కార్డులు రేపటి నుంచి ఆన్‌లైన్‌లో.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

0
0



ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO నిర్వహిస్తున్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి అడ్మిట్ కార్డులను రేపు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in  నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబరు/రూల్ నంబరు, పాస్‌వర్డ్/పుట్టిన రోజు‌ను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డును పొందవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 30, 31న నిర్వహించనున్నారు. రెండు దశల్లో పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తే మెయిన్ పరీక్షకు అర్హులవుతారు.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా..

  • epfindia.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోం పేజీలో EPFO Assistant Admit Card 2019 లింకును ఓపెన్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ నంబరు/ రూల్ నంబరు, పాస్‌వర్డ్/పుట్టిన రోజు వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
  • EPFO Assistant Admit Card 2019 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • Loading…

  • దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్తు అవసరాల కోసం దాచి పెట్టుకోండి.

పరీక్షకు వెళ్లే సమయంలో అభ్యర్థులు కాల్ లెటర్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌తో రావాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో భాగంగా పేపర్-1లో 100 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here