Flipkart: 20,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు శిక్షణ ఇవ్వనున్న ఫ్లిప్‌కార్ట్

0
1



సుమారు 20,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు శిక్షణ ఇప్పించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఫ్లిప్‌కార్ట్. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌ 20,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌(విష్ మాస్టర్స్)కు శిక్షణ ఇవ్వనుంది. ఇ-కామర్స్ కంపెనీతో లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌-LSC ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. సప్లై చెయిన్ రంగంలో పనిచేసే డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు ప్రొడక్ట్ డెలివరీ నుంచి కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ వరకు అన్ని అంశాల్లో శిక్షణ ఇవ్వడమే ఈ ఒప్పందం లక్ష్యం. లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌‌తో కలిసి డెలివరీ మెకానిజంకు సంబంధించిన అంశాలతో 8 గంటల ట్రైనింగ్ మాడ్యూల్‌ను రూపొందించనుంది ఫ్లిప్‌కార్ట్. పార్సిల్ డెలివరీ, స్థానిక రవాణా చట్టాలు, నియమనిబంధనలు, సప్లై చైన్‌కు సంబంధించిన అవగాహన లాంటి అంశాల్లో ఈ శిక్షణ ఉంటుంది. వీటితో పాటు కస్టమర్లతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్న అంశాలతో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది.

ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్-NSFQ నియమాలకు అనుగుణంగా ‘రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్’ సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ జారీ చేసే ఈ సర్టిఫికెట్‌కు భారతదేశంతో పాటు జర్మనీ, డెన్మార్క్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా దేశాల్లోనూ గుర్తింపు ఉంటుంది. మొదట 20,000 మందికి భవిష్యత్తులో మరో 30,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు ఈ శిక్షణ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ దేశంలోని అన్ని ప్రాంతాలకు రోజుకు 10 లక్షల పార్సిల్స్ డెలివరీ చేస్తోంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్… లుక్స్ అదుర్స్


ఇవి కూడా చదవండి:

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ ఉద్యోగాలు… దరఖాస్తు చేయండి ఇలా…

BECIL Jobs: 2,684 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

UPSC Jobs: డిఫెన్స్, నావల్ అకాడమీలో 415 ఖాళీలు… ఇంటర్ పాసైతే చాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here