HDFC లోన్ మేళా: గుడ్‌న్యూస్.. మీ గ్రామానికే ట్రాక్టర్, వెహికిల్ లోన్!

0
2


HDFC లోన్ మేళా: గుడ్‌న్యూస్.. మీ గ్రామానికే ట్రాక్టర్, వెహికిల్ లోన్!

రానున్న ఆరు నెలల కాలంలో 1,000 వరకు గ్రామీణ రుణ మేళాలను నిర్వహిస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆదివారం వెల్లడించింది. రిటైల్ పోర్ట్ పోలియో విస్తరణలో భాగంగా వీటిని నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ గ్రామీణ రుణమేళాలను దేశవ్యాప్తంగా 300కు పైగా జిల్లాల్లో… 6,000 గ్రామాల్లో నిర్వహిస్తామని చెప్పింది. రుణ మేళా సంప్రదాయ విలేజ్ ఫెయిర్‌లా ఉంటుందని పేర్కొంది. చుట్టుపక్కల ఐదురు గ్రామాలకు కలిపి వన్ స్టాప్ షాప్ ఉంటుందని తెలిపింది.

రుణమేళాలో ఇవి అందుబాటులో..

ఈ గ్రామీణ రుణ మేళాలో బ్యాంకు ప్రాడక్ట్స్ అన్నీ ఒకేచోట ఉంటాయి. వినియోగదారులు ట్రాక్టర్, ఆటో, టీ-వీలర్, అగ్రి లోన్స్ పొందడంతో పాటు సేవింగ్/కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంతేకాకుండా స్వయం సహాయక బృందాలు (SHGs) కూడా సులభతర ఫైనాన్స్ పొందవచ్చు.

మేళాలో ప్రదర్శన

మేళాలో ప్రదర్శన

టోల్ ఫ్రీ నెంబర్‌కు డయల్ చేయడం ద్వారా ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేయడం, చెక్ బుక్స్ ఆర్డర్ చేయడం వంటి ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేయడానికి వినియోగదారులను అనుమతించే మిస్డ్ కాల్ బ్యాంకింగ్ వంటి సేవలు మేళాలో ప్రదర్శిస్తారు.

ప్రతి ఇంటికి బ్యాంకింగ్ ఉత్పత్తులు

ప్రతి ఇంటికి బ్యాంకింగ్ ఉత్పత్తులు

బ్యాంకింగ్ ఉత్పత్తులను ప్రతి ఇంటికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నామని, ఇందులో భాగంగా గ్రామీణ లోన్ మేళాను నిర్వహిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంట్రీ హెడ్ (బ్రాంచ్ బ్యాంకింగ్) అరవింద్ వోహ్రా తెలిపారు. కాగా, బ్యాంకింగ్ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి లోన్ మేళాలు ఓ వేదికగా ఉపయోగపడతాయి. రుణప్రవాహం పెంచేందుకు 400 జి్లాల్లో రుణమేలాలు నిర్వహించాలని ఇటీవల ప్రభుత్వం PSU రంగ బ్యాంకులను కోరిన విషయం తెలిసిందే.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here