India Post Jobs: పోస్ట్ ఆఫీస్‌లో డ్రైవర్ ఉద్యోగాలు… దరఖాస్తుకు 2 రోజులు గడువు

0
0



ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీ చేపట్టింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ డివిజన్లలో స్టాఫ్ కార్ డ్రైవర్లను నియమించనుంది. ఇందుకోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 6 పోస్టులున్నాయి. వాటిలో ఓబీసీలకు 2, ఎస్టీలకు 1 పోస్టును రిజర్వ్ చేశారు. ఎంపికైనవారికి రూ.19,900 వేతనం లభిస్తుంది. రెండేళ్లు ప్రొబేషన్ పీరియడ్. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 14 చివరి తేదీ. 18 నుంచి 27 ఏళ్లలోపు వాళ్లే దరఖాస్తు చేసుకోవాలి. ఓబీసీ, ఎస్టీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. లైట్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో కనీసం మూడేళ్లు అనుభవం ఉండాలి. దాంతోపాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్ తర్వాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. పరీక్ష తేదీ, స్థలం లాంటి వివరాలను ఇండియా పోస్ట్ త్వరలో వెల్లడించనుంది. డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తుల్ని పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్, విద్యార్హతల సర్టిఫికెట్, డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్, ఓబీసీ, ఎస్టీలకు క్యాస్ట్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్‌తో పాటు ఓ పాస్‌పోర్ట్ ఫోటో దరఖాస్తుకు జత చేయాలి. ఆగస్ట్ 14 సాయంత్రం 5.30 గంటల తర్వాత వచ్చిన దరఖాస్తుల్ని అనుమతించరు. దరఖాస్తుల్ని ఈ కింది అడ్రస్‌కు పంపాలి.
The Manager, Mail Motor Service,
Koti, Hyderabad – 500095

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ… అదిరిపోయిన ఫోటోలు

ఇవి కూడా చదవండి:

SAIL Jobs: స్టీల్ అథారిటీలో 361 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలు ఇవే

Andhra Bank Jobs: ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలు… 10వ తరగతి పాసైతే చాలు

NLC Recruitment 2019: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 875 ఉద్యోగాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here