Jobs: ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థలో ఉద్యోగాలు… దరఖాస్తుకు 2 రోజులే గడువు

0
0



ఎయిర్‌లైన్ అల్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్ సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 52 పోస్టులున్నాయి. హైదరాబాద్‌లో 8 పోస్టులున్నాయి. ఎయిర్ ఇండియా లిమిటెడ్‌కు అల్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో ఫైనాన్స్, పర్సనల్, మార్కెటింగ్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, ట్రాన్స్‌పోర్ట్, అడ్మిన్, ఫ్రంట్‌డెస్క్ లాంటి విభాగాల్లో సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. సీనియర్ సూపర్‌వైజర్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి. సూపర్‌వైజర్ పోస్టుకు హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఏడాది డిప్లొమా ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 9 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తును పోస్ట్‌లో పంపాలి. ఎయిర్‌లైన్ అల్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Airline Allied Services Limited Jobs 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

మొత్తం పోస్టులు- 52 దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 15
దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 09
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
వయస్సు: సీనియర్ సూపర్‌వైజర్ పోస్టుకు 40 ఏళ్లు, సూపర్‌వైజర్ పోస్టుకు 35 ఏళ్లు.
వేతనం: సీనియర్ సూపర్‌వైజర్‌కు రూ.27,755, సూపర్‌వైజర్‌కు రూ.23,871.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ ఇదే…
Alliance Air Personnel Department Alliance Bhawan,
Domestic Terminal -1,
I.G.I Airport, New Delhi -110037

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Huawei Y9 Prime: ఇండియాలో రిలీజైన హువావే వై9 ప్రైమ్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్… ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 355 ఉద్యోగాలు… ప్రాంతాలవారీగా పోస్టులివే

Jobs: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 1,300 పైగా ఉద్యోగాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here