Jobs: గ్రామ సచివాలయ ఉద్యోగాల దరఖాస్తుకు ముగిసిన గడువు..1 నుంచి పరీక్షలు..

0
0గ్రామ వార్డు, సచివాలయ సిబ్బంది ఉద్యోగాల కోసం 21 లక్షల 69 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు వచ్చే నెల 1 నుంచి 8 వరకు జరుగుతాయి. 1వ తేదీన 15 లక్షల మంది పరీక్ష రాస్తున్నారని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 6 వేల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, జాబ్ ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మవద్దని, పరీక్ష ఫలితాల మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు ఆబ్జెక్టివ్ టైపులో ఆఫ్ లైన్లో ఎగ్జామ్ ఉండనుంది. ప్రభుత్వం ప్రత్యేక సిలబస్‌ను గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగాల కోసం రూపొందిస్తున్నట్లు తెలిసింది. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం 150 మార్కుల పరీక్షను 2 గంటల 30 నిమిషాలపాటూ నిర్వహిస్తారు.

ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని బట్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలేవీ ఉండవు. 150 మార్కుల పరీక్షలో… 75 మార్కులు ఉద్యోగానికి సంబంధించినవి, మిగతా 75 జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించినవి ఉంటాయి. ఈ ఉద్యోగాల నియామకంలో 70 శాతం స్థానికులకు ప్రాధాన్యం ఇస్తారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here