Jobs: డిసెంబర్ లోగా 2,200 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

0
4



అధ్యాపక వృత్తిలో స్థిరపడాలనుకునేవారికి శుభవార్త. డిసెంబర్ లోగా 2,200 ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ కానున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ-NIT విద్యాసంస్థల్లో నియామక ప్రక్రియ చేపట్టాలని, ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-NITSER కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ ఆదేశాలిచ్చారు. ఈ సమావేశానికి ఎన్ఐటీలతో పాటు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-IIEST డైరెక్టర్లు, బోర్డ్ ఛైర్‌పర్సన్లు, గవర్నర్లు పాల్గొన్నారు. “అన్ని ఎన్ఐటీల్లో ఫ్యాకల్టీ కొరత గురించి ప్రధానంగా చర్చ జరిగింది. నియామక ప్రక్రియను వేగవంతం చేసి, ఖాళీలను భర్తీ చేసి ఆయా విద్యాసంస్థల ర్యాంకుల్ని మెరుగుపర్చాలని సూచించాం. డిసెంబర్ లోగా సుమారు 2,200 ఫ్యాకల్టీ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించాం” అని హెచ్ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. అంతా సాఫీగా జరిగిపోతే దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటీల్లో 2,200 పోస్టులు భర్తీకానున్నాయి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Jobs: ఫెస్టివల్ సేల్ కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో 1,40,000 ఉద్యోగాల భర్తీ

ONGC Jobs: ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు… ఖాళీల వివరాలివే

Loading…

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here