LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

0
1



లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్- LIC HFL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 300 పోస్టులున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, చండీగఢ్, కర్నాటక, కేరళ, పుదుచ్చెరీ, తమిళనాడు, గోవా, గుజరాత్, మహారాష్ట్రలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 8న ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

LIC HFL Recruitment 2019: ఖాళీలు, అర్హతల వివరాలివే…

మొత్తం ఖాళీలు- 300 అసిస్టెంట్ పోస్టులు- 125
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు- 100
అసోసియేట్ పోస్టులు- 75
విద్యార్హత: అసిస్టెంట్ పోస్టుకు 55% మార్కులతో గ్రాడ్యుయేషన్. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎంబీఏ / పీజీడీఎం, పీజీ డిప్లొమా, రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంఎంఎస్ / రెండేళ్ల ఫుల్ టైమ్ PGDBA/ PGDBM/ PGPM/ PGDM కోర్సులు చేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అసోసియేట్ పోస్టుకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏ ఇంటర్ ఉండాలి.
వయస్సు: 21 నుంచి 28 ఏళ్లు
ఫీజు: రూ.500

LIC HFL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 ఆగస్ట్ 08
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు- 2019 ఆగస్ట్ 26
కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2019 సెప్టెంబర్ 09
ఆన్‌లైన్ పరీక్ష (తాత్కాలిక తేదీ)- 2019 అక్టోబర్ 09 లేదా 10

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ… అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్… ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 355 ఉద్యోగాలు… ప్రాంతాలవారీగా పోస్టులివే

DRDO Scholarship: అమ్మాయిలకు గుడ్ న్యూస్… డీఆర్‌డీఓ నుంచి స్కాలర్‌షిప్

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here