National Film Awards: ఉత్తమ నటిగా కీర్తి సురేష్.. ‘మహానటి’కి అవార్డుల పంట

0
1


‘మహానటి’ మూవీ హీరోయిన్ కీర్తి సురేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన చిత్ర పురస్కాలను శుక్రవారం నాడు ప్రకటించగా.. ‘మహానటి’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఎంపికైంది కీర్తి సురేష్. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘మహానటి’ ఎంపిక కావడం విశేషం.

అందం, అభినయం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే రూపం నాటికి నేటికి సావిత్రిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సిరివెన్నెల అన్నట్టు ఆమె నటనలో ఎవరెస్ట్. అందుకే సావిత్రితో పోలికకైనా చాలా మంది వెనకాడుతుంటారు. అలాంటిది కీర్తి సురేష్‌ను సావిత్రి పాత్రలో చూపిస్తూ… సావిత్రి వాస్తవ జీవితంలో కీలక ఘట్టాలను తెరకెక్కించే సాహసం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే సావిత్రిగా కీర్తి సురేష్ నటించింది అనటం కంటే జీవించింది అనటమే కరెక్ట్. సావిత్రి పాత్రకు వందశాతం న్యాయం చేసి శెభాష్ అనిపించుకుంది కీర్తి.

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి సావిత్రి. ఆ జీవితం మొత్తం తెరచిన పుస్తకమే. 75 శాతం నటిగానే సాగింది ఆమె జీవితం. ఆ మిగిలిన 25 శాతం జీవిత పరిణామాలపై రకరకాల ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతూ మే 9న ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ విడుదలైన తొలి తెలుగు బయోపిక్ మూవీ ‘మహానటి’ తిరుగులేని కలెక్షన్లతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. లాంగ్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా సరికొత్త రికార్డులు నమోదు చేసింది మహానటి.

జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్‌.. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య.. ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు.. జర్నలిస్ట్ మధురవాణిగా సమంత.. ఫోటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీగా విజయ్ దేవకొండ.. ఎస్వీఆర్‌గా మోహన్ బాబు.. సుశీలగా శాలినీ పాండే.. మాలివికగా అలమేలు… కెవి రెడ్డిగా క్రిష్.. కెవి చౌదరిగా రాజేంద్ర ప్రసాద్.. ఆలూరి చక్రపాణిగా ప్రకాష్ రాజ్ తదితర భారీ తారాగణంతో ప్రేక్షకులు ‘మహానటి’ చిత్రంతో కనులవిందు చేశారు. ఈ హిస్టారికల్ క్లాసికల్ మూవీని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్న, ప్రియాంక దత్‌లు నిర్మించారు.

66వ నేషనల్ అవార్డ్స్ విజేతల వివరాలు..
1. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): మహానటి
2. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్: అ!, కేజీఎఫ్
3. ఉత్తమ కథానాయిక: కీర్తి సురేష్
4. ఉత్తమ నటుడు: ధనుష్
5. ఉత్తమ మిక్స్డ్ ట్రాక్: రంగస్థలం
6. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: అ!
7. ఉత్తమ యాక్షన్ చిత్రం: కేజీఎఫ్
8. బెస్ట్ లిరిక్స్: మంజుతా (నాతి చరామి)
9. బెస్ట్ మ్యూజిక్: పద్మావతి
10. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చి.ల.సౌ
11. ఉత్తమ మేకప్: అ!
12. ఉత్తమ వీఎఫ్ఎక్స్: అ!
13. ఉత్తమ సౌండ్ మిక్సింగ్: రంగస్థలంSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here