NVS Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలు… దరఖాస్తుకు 2 రోజులే గడువు

0
2



ఉపాధ్యాయులకు శుభవార్త. నవోదయ విద్యాలయ సమితిలో పీజీటీ, టీజీటీతో పాటు అసిస్టెంట్ కమిషనర్, పీజీటీ, టీజీటీ, లైబ్రెరియన్, పీఈటీ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు ఆగస్ట్ 9 చివరి తేదీ. మొత్తం 2370 ఉద్యోగాలున్నాయి. వాటిలో టీజీటీ-1154, పీజీటీ-430, మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్-564, అసిస్టెంట్ కమిషనర్-05, ఫీమేల్ స్టాఫ్ నర్స్-55, లీగల్ అసిస్టెంట్-01, కేటరింగ్ అసిస్టెంట్-26, లోయర్ డివిజన్ క్లర్క్-135 పోస్టులున్నాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

NVS Recruitment 2019: ముఖ్యమైన తేదీలు ఇవే…

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 జూలై 10 దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 09
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 ఆగస్ట్ 12
రాతపరీక్ష: 2019 సెప్టెంబర్ 5 – సెప్టెంబర్ 10 మధ్య ఉండొచ్చని అంచనా.

నవోదయ విద్యాలయ సమితి కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తిగల సంస్థ. పాఠశాల విద్య, అక్షరాస్యత, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉండగా 630 పైగా నవోదయ విద్యాలయాలున్నాయి. ఈ పాఠశాలల్లో 2370 పోస్టుల భర్తీ కోసం నియామక ప్రక్రియ చేపట్టింది నవోదయ విద్యాలయ సమితి. నియామక ప్రక్రియ పూర్తయ్యేసరికి పోస్టులు పెరగొచ్చు లేదా తగ్గొచ్చని నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ… అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:

Jobs: రక్షణ శాఖకు చెందిన సంస్థలో 337 ఉద్యోగాలు

ISRO Jobs: ఇస్రో అనుబంధ సంస్థలో 158 ఉద్యోగాలు… నేరుగా ఇంటర్వ్యూ

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్… ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here