PF ఖాతాదారులకు శుభవార్త: వడ్డీ రేటు పెంపు, మొత్తం 54,000 కోట్ల వడ్డీ

0
3


PF ఖాతాదారులకు శుభవార్త: వడ్డీ రేటు పెంపు, మొత్తం 54,000 కోట్ల వడ్డీ

ప్రావిడెంట్ ఫండ్(PF) చందాదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను పీఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 8.55 శాతం ఉన్న వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచింది. ఈ నిర్ణయంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి పొందినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ నిర్ణయంతో 60 మిలియన్ల ఈపీఎఫ్ మెంబర్స్‌కు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ అన్నారు. ప్రభుత్వం పీఎఫ్ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచేందుకు అంగీకరించిందని తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం ఉండగా 2018-19కి 8.55 శాతం వడ్డీ రేటుకు అంగీకరించినట్లు చెప్పారు.

ఈ నిర్ణయంతో 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు రూ.54,000 కోట్ల వడ్డీ క్రెడిట్ కానుందని చెప్పారు. ఈపీఎఫ్ పైన వడ్డీ రేటును పెంచాలనే ప్రతిపాదనను గత ఫిబ్రవరిలో చేశారు. ఇప్పుడు దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో వడ్డీ రేటును పది బేసిస్ పాయింట్లు పెంచారు.

దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 8.65 శాతం వడ్డీని పొందనున్నారని కేంద్రమంత్రి మంత్రి సంతోష్ గాంగ్వార్ గత మంగళవారమే చెప్పారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్కైబర్లకు 8.65 వడ్డీ రేటు ఇచ్చేందుకు గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకుంది.

దీని ఆమోదం కోసం ఆర్థికమంత్రిత్వ శాఖకు పంపించిన నేపథ్యంలో గత వారం కార్మిక మంత్రి వ్యాఖ్యలు గమనార్హం. పండుగ సీజన్ నేపథ్యంలో 6 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం వడ్డీని ఇస్తున్నామని తెలిపారు.

అంతకుముందు ఏడాది ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది. 2017-18లో ఆమోదించిన వడ్డీ రేటు ఉంది. ఇప్పుడు 0.10 శాతం పెంచారు. దీని కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు. కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య వడ్డీ రేటుపై ఉన్న భిన్నాభిప్రాయాలను తొలగించుకునేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిపిన చర్చల్లో 8.65 శాతం వడ్డీ రేటు చెల్లించినా సంస్థ వద్ద సరిపడా మిగులు ఉందని వివరించిన అనంతరం పెంపుదలకు మార్గం సుగమమైంది. ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును పెంచడం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీఎఫ్ వడ్డీ రేటు పెంపు కోసం వేచి చూస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here