Railway Jobs: కొంకణ్ రైల్వేలో ట్రైనీ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

0
3



కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్-KRCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్-NATS కింద ట్రైనీ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 135 ఖాళీలను ప్రకటించింది. మహారాష్ట్ర, మడగావ్, కార్వార్ పరిధిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా సిగ్నల్ & టెలీకమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసినవాళ్లు ట్రైనీ అప్రెంటీస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు www.konkanrailway.com వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు చూడొచ్చు. దరఖాస్తుకు నవంబర్ 18 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని, సైన్ చేసి, ఫోటోలు అతికించి, సర్టిఫికెట్ కాపీలు జత చేసి నోటిఫికేషన్‌లో తెలిపిన అడ్రస్‌కు పంపాలి. ట్రైనీ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఖాళీల వివరాలను ఈ చార్ట్‌లో చూడండి.

Konkan Railway Recruitment 2019 Konkan Railway Corporation Limited Notification for 135 Trainee Apprentices posts

Source: Konkan Railway

Konkan Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 135
బీఈ (సివిల్)- 25
బీఈ (ఎలక్ట్రికల్)- 30
బీఈ (ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్స్)- 18

Loading…

బీఈ (మెకానికల్)- 05
డిప్లొమా (సివిల్)- 29
డిప్లొమా (ఎలక్ట్రికల్)- 28
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 నవంబర్ 18
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: 2019 నవంబర్ 30
విద్యార్హత: గ్రాడ్యుయేట్ పోస్టుకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. డిప్లొమా అప్రెంటీస్‌కు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌కు నెలకు రూ.4984, డిప్లొమా హోల్డర్స్‌కు రూ.3542.
వయస్సు: 21 నుంచి 25 ఏళ్లు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant Personnel Officer II,
Konkan Railway Corporation Ltd,
4th Floor, Belapur Bhavan,
CBD Belapur, Navi Mumbai- 400614.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు

ISRO Jobs: ఇస్రోలో ఇంజనీర్ జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే

SBI Jobs: గుడ్ న్యూస్… 477 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించిన ఎస్‌బీఐ



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here