Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్… ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

0
5



రైల్వేలో ఉద్యోగం సంపాదించడం నిరుద్యోగుల కల. కేవలం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నిర్వహించే పరీక్షలు మాత్రమే కాదు… రైల్వేలో ఉద్యోగానికి వేర్వేరు విభాగాలు నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంటాయి. రైల్వేకు చెందిన అనుబంధ సంస్థలు కూడా నియామకాలు చేపడుతుంటాయి. ఆయా రైల్వే జోన్లకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్-RRC కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. ఇలా రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి అనేక అవకాశాలున్నాయి. ఇటీవల కాలంలో వేర్వేరు రైల్వే జోన్లు, రైల్వే అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటికి దరఖాస్తు చేయడానికి నిరుద్యోగులకు ఇంకా గడువు ఉంది. మరి ఆ నోటిఫికేషన్ల గురించి తెలుసుకొని మీ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు ఉన్నాయేమో చూసి దరఖాస్తు చేయొచ్చు. ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హతల గురించి తెలుసుకోవడం మంచిది. మరి ఇటీవల రైల్వేలో ఉద్యోగాలకు జారీ అయిన నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.

North Western Railway Recruitment 2019: వాయువ్య రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 21 ఖాళీలున్నాయి. గ్రూప్ సీ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలివి. 12వ తరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి. దరఖాస్తుకు అక్టోబర్ 23 చివరి తేదీ. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

West Central Railway Recruitment 2019: పశ్చిమ మధ్య రైల్వే 160 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. దరఖాస్తుకు నవంబర్ 5 చివరి తేదీ. 10వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు అప్రెంటీస్ పోస్టుకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Jobs, Railway Recruitment Board Notifications, Railway Recruitment Cell Notifications, RRC Jobs, Indian Railways Jobs, Railway sports quota jobs, North Western Railway Jobs, West Central Railway Apprentice Jobs, railway jobs 2019 for 10th pass, Northeast Frontier Railway Apprentice Jobs 2019, South Western Railway Jobs, Konkan Railway Trainee Apprentice Recruitment, RITES Limited Recruitment 2019, Northern Railway Recruitment 2019, Western Senior Clerk Cum Typist Jobs, రైల్వే ఉద్యోగాలు 2019, ఆర్ఆర్‌బీ ఉద్యోగాలు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్, రైల్వే స్పోర్ట్స్ కోటా జాబ్స్, రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జాబ్స్, సౌత్ వెస్టర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్, కొంకణ్ రైల్వే ట్రైనీ అప్రెంటీస్ నోటిఫికేషన్, రైట్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2019, నార్త్ వెస్టర్న్ రైల్వే ఉద్యోగాలు, ఉత్తర రైల్వే రిక్రూట్‌మెంట్, ఉత్తర రైల్వే ఎంటీఎస్ జాబ్స్ 2019, వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ జాబ్స్

ప్రతీకాత్మక చిత్రం


Western Railway Recruitment 2019: పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC అసిస్టెంట్ లోకో పైలట్-ALP, టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 306 ఖాళీలున్నాయి. ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నవాళ్లు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 12న ప్రారంభం కానుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Northeast Frontier Railway Apprentice 2019: నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే-NFR భారీగా అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 2590 పోస్టుల్ని ప్రకటించింది. వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్, మెకానికల్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, లైన్‌మెన్, మేసన్, ఫిట్టర్ స్ట్రక్చరల్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

South Western Railway Recruitment 2019: సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. స్పోర్ట్స్ కోటా 2019-20 గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 21 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 28 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading…

Railway Jobs, Railway Recruitment Board Notifications, Railway Recruitment Cell Notifications, RRC Jobs, Indian Railways Jobs, Railway sports quota jobs, North Western Railway Jobs, West Central Railway Apprentice Jobs, railway jobs 2019 for 10th pass, Northeast Frontier Railway Apprentice Jobs 2019, South Western Railway Jobs, Konkan Railway Trainee Apprentice Recruitment, RITES Limited Recruitment 2019, Northern Railway Recruitment 2019, Western Senior Clerk Cum Typist Jobs, రైల్వే ఉద్యోగాలు 2019, ఆర్ఆర్‌బీ ఉద్యోగాలు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్, రైల్వే స్పోర్ట్స్ కోటా జాబ్స్, రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జాబ్స్, సౌత్ వెస్టర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్, కొంకణ్ రైల్వే ట్రైనీ అప్రెంటీస్ నోటిఫికేషన్, రైట్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2019, నార్త్ వెస్టర్న్ రైల్వే ఉద్యోగాలు, ఉత్తర రైల్వే రిక్రూట్‌మెంట్, ఉత్తర రైల్వే ఎంటీఎస్ జాబ్స్ 2019, వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ జాబ్స్

ప్రతీకాత్మక చిత్రం

Konkan Railway Recruitment 2019: కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్-KRCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్-NATS కింద ట్రైనీ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 135 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు నవంబర్ 18 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Western Railway Recruitment 2019: పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 149 ఉద్యోగాలున్నాయి. ఇవి రైల్వే ఉద్యోగులకు కేటాయించిన పోస్టులు. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RITES Limited Recruitment 2019: భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్-RITES లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. జూనియర్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్, సైట్ ఇన్‌స్పెక్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 93 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 10 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Jobs, Railway Recruitment Board Notifications, Railway Recruitment Cell Notifications, RRC Jobs, Indian Railways Jobs, Railway sports quota jobs, North Western Railway Jobs, West Central Railway Apprentice Jobs, railway jobs 2019 for 10th pass, Northeast Frontier Railway Apprentice Jobs 2019, South Western Railway Jobs, Konkan Railway Trainee Apprentice Recruitment, RITES Limited Recruitment 2019, Northern Railway Recruitment 2019, Western Senior Clerk Cum Typist Jobs, రైల్వే ఉద్యోగాలు 2019, ఆర్ఆర్‌బీ ఉద్యోగాలు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్, రైల్వే స్పోర్ట్స్ కోటా జాబ్స్, రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జాబ్స్, సౌత్ వెస్టర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్, కొంకణ్ రైల్వే ట్రైనీ అప్రెంటీస్ నోటిఫికేషన్, రైట్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2019, నార్త్ వెస్టర్న్ రైల్వే ఉద్యోగాలు, ఉత్తర రైల్వే రిక్రూట్‌మెంట్, ఉత్తర రైల్వే ఎంటీఎస్ జాబ్స్ 2019, వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ జాబ్స్

ప్రతీకాత్మక చిత్రం

Northern Railway Recruitment 2019: ఉత్తర రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ 118 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Western Railway Recruitment 2019: వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 99 ఖాళీలున్నాయి. ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవారికి జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా ఈ పోస్టుల్ని ప్రకటించింది. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది… రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే…

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు… ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి…



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here