Railway Jobs: రైల్వేలో టీచర్ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

0
1



రైల్వేలో క్లరికల్, టెక్నికల్ ఉద్యోగాలు మాత్రమే కాదు… రైల్వే కాలేజీల్లో టీచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. లెక్చరర్ (పీజీటీ), అసిస్టెంట్ టీచర్ (టీజీటీ), ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ) పోస్టుల భర్తీకి నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 22 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది నార్త్ సెంట్రల్ రైల్వే. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో గల నార్త్ సెంట్రల్ రైల్వే కాలేజీలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టుల భర్తీకి నార్త్ సెంట్రల్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫార్మాట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

North Central Railway Recruitment 2019: ఖాళీల వివరాలు

మొత్తం ఖాళీలు- 22 లెక్చరర్ (పీజీటీ)- 8 Posts
బయాలజీ- 1
ఇంగ్లీష్- 1
కామర్స్- 1

Loading…

హిస్టరీ అండ్ సివిక్స్- 1
మ్యాథ్స్- 1
జాగ్రఫీ- 1
హిందీ- 1
ఎకనమిక్స్- 1

అసిస్టెంట్ టీచర్ (టీజీటీ)- 8
మ్యూజిక్ / వోకల్- 1
పీటీఐ (మేల్)- 1
ఇంగ్లీష్- 1
మ్యాథ్స్+సైన్స్- 3
సోషల్ సైన్స్- 1
ఇంగ్లీష్+జాగ్రఫీ- 1

ప్రైమరీ టీచర్ (పీఆర్టీ)- 6

North Central Railway Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు, వేతనాలు

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 30
పీజీటీ పోస్టుకు ఇంటర్వ్యూ- 2019 నవంబర్ 4 ఉదయం 08:30 గంటలకు
టీజీటీ పోస్టుకు ఇంటర్వ్యూ- 2019 నవంబర్ 5 ఉదయం 08:30 గంటలకు
పీఆర్టీ పోస్టుకు ఇంటర్వ్యూ- 2019 నవంబర్ 6 ఉదయం 08:30 గంటలకు
వేతనం: లెక్చరర్ (పీజీటీ) పోస్టుకు రూ.27,500, అసిస్టెంట్ టీచర్ (టీజీటీ) పోస్టుకు రూ.26,250, ప్రైమరీ టీచర్ (పీఆర్టీ) పోస్టుకు రూ.21,250.
సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Principal,
North Central Raillway College,
Tundla, District – Firozabad – 283204 (UP).

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Reliance Trends: రిలయెన్స్ ట్రెండ్స్‌ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి


ఇవి కూడా చదవండి:

Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 పైగా టీచర్ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

TSCAB Jobs: తెలంగాణ కోఆపరేటీవ్ బ్యాంక్‌లో 62 ఉద్యోగాలు… డిగ్రీ పాసైతే చాలు

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 170 అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టులు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here