Railway Jobs: రైల్వేలో 752 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

0
9



రైల్వేలో ఉద్యోగం చేస్తున్నవారికి శుభవార్త. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా 752 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, స్టేషన్ మాస్టర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది పశ్చిమ రైల్వే. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు www.rrc-wr.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 1న ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 30 చివరి తేదీ. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

మొత్తం పోస్టులు – 752 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 105
ట్రైన్స్ క్లర్క్- 18
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 238
గూడ్స్ గార్డ్- 100

Loading…

సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 129
స్టేషన్ మాస్టర్- 135
వయస్సు- జనరల్ అభ్యర్థులకు 21-42 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 21-45 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21-47 ఏళ్లు.
దరఖాస్తు ప్రారంభం- 2019 జూలై 1
దరఖాస్తు ముగింపు- 2019 జూలై 30

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే…

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు… ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి…



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here