Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

0
3



రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. గ్రూప్ సీ కింద 21 మంది క్రీడాకారులకు ఉద్యోగాలను ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. నోటిఫికేషన్ వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ https://scr.indianrailways.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 26 చివరి తేదీ. అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పిటి జిల్లాలు, పాంజీ సబ్‌డివిజన్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ ప్రాంతాల వారికి దరఖాస్తుకు సెప్టెంబర్ 11 చివరి తేదీ. పదో తరగతి లేదా ఎస్‌ఎస్‌సీ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నికల్ ట్రేడ్స్ పోస్టులకు ఐటీఐ తప్పనిసరి. వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీ, ఆర్థికంగా బలహీన వర్గాలకు ఫీజు రూ.250. పరీక్ష తేదీ త్వరలో వెల్లడించనుంది సౌత్ సెంట్రల్ రైల్వే.

South Central Railway Recruitment 2019: క్రీడలకు కేటాయించిన పోస్టుల వివరాలు

ఆర్చరీ (మహిళలు)- 2 అథ్లెటిక్స్ (పురుషులు)- 3
అథ్లెటిక్స్ (మహిళలు)- 1
బాల్ బ్యాడ్మింటన్ (పురుషులు)- 1
బాస్కెట్ బాల్ (పురుషులు)- 1
బాస్కెట్ బాల్ (మహిళలు)- 1
బాక్సింగ్ (పురుషులు)- 1
చెస్ (పురుషులు)- 1
హ్యాండ్‌బాల్ (పురుషులు)- 2
హాకీ (పురుషులు)- 1
కబడ్డీ (పురుషులు)- 1
కబడ్డీ (స్త్రీలు)- 1
టెన్నిస్ (పురుషులు)- 1
వాలీబాల్ (పురుషులు)- 1
వాలీబాల్ (మహిళలు)- 1
వెయిట్‌లిఫ్టింగ్ (పురుషులు)- 1
వెయిట్‌లిఫ్టింగ్ (మహిళలు)- 1
మొత్తం పోస్టులు- 21

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ… కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే…

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు… ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి…



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here