Roja: నీ నోట్లో నాలుక లేదంటే ఎవరైనా నమ్ముతారా రోజా?: నాగబాబు

0
0


రోజా, నాగబాబు.. రాజకీయంగా ఇద్దరి దారులు వేరైనా బుల్లితెరపై మాత్రం ఈ ఇద్దరూ జడ్జ్‌లుగా ఉన్నారంటే అక్కడ నవ్వుల జాతరే. ‘జబర్దస్త్’ కామెడీ షోతో ప్రతి వారం హాస్యపు విందు అందిస్తున్న రోజా, నాగబాబులలో ఎవరు లేకపోయినా ‘జబర్దస్త్’కి లోటుగానే అనిపిస్తుంది. అంతలా ఈ కార్యక్రమం ద్వారా పాపులర్ అయ్యారు ఈ ఇద్దరూ. అందుకే పొలిటికల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారిని ప్రజలకు చేరువచేసిన ఈ కామెడీ షోని మాత్రం వదిలిపెట్టడం లేదు.

జబర్దస్త్ కామెడీ షోలో జడ్జ్‌లు ఉంటే ఈ ఇద్దరూ డైరెక్ట్‌గా పెర్ఫామ్ చేసేందుకు రంగంలోకి దిగారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని.. నా నవ్వు బాగుంటుంది అంటే నా నవ్వే బాగుంటుందని తెగ గొడవపడుతున్నారు. అందులో అలకలు, కోపాలు, సాంగ్‌లు అబ్బో.. ఇంకా చాలానే ఉన్నాయక్కడ.

Read Also: ‘కౌసల్య కృష్ణమూర్తి’ రివ్యూ: స్లో బౌండరీ

వినాయక చవితి సందర్భంగా ఈవీటీ వారు జబర్దస్త్ కామెడీ షో టీంతో ‘ఔను వాళ్లిద్దరూ గొడవపడ్డారు’ అనే మస్త్ మజా ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించారు. ఉగాదినాడు ఉదయం 9 గంటలకు ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇందులో అందాల రోజా.. మరింత అందంగా తయారై మెరుస్తుంటే నాగబాబు.. ‘ఏంటి ఇవాళ ఇంత అందంగా ఉన్నావ్’ అంటూ పొగడ్తలు మొదలుపెట్టారు. ఇక బ్యాగ్రౌండ్‌లో.. ‘కన్ను కొట్టి చూసెనంట సుందరి.. మనసు మీటి వెళ్లెనంట మనోహరి’ సాంగ్ మొదలైంది.

‘నా నవ్వు ఉంటే చాలు షో హిట్ అయిపోద్ది.. మీ నవ్వు కూడా బాగానే ఉంటుంది బాబుగారూ’ అని రోజా అనడంతో.. ఒకసారి జనాన్ని అడుగు నవ్వుల నాగబాబు అంటారు కాని.. నవ్వుల రోజా అని ఎవరూ అనరు అంటూ ఇప్పుడు ఇద్దర్లో ఎవరు నవ్వు బాగుంటుందో నువ్వే చెప్పాలని యాంకర్ ప్రదీప్‌ దగ్గర పంచాయితీ పెట్టారు.

Read Also: బాబాపై హిమజ ఆగ్రహం.. ప్లేట్ విసిరి, గుడ్లు నేలకోసి కొట్టి రచ్చ రచ్చ

ఇక శేఖర్ మాస్టర్ సైతం ఎంటరై.. ఎవరు నవ్వు బాగుంటుంది అని అంటే రోజా నవ్వు చూసి తెగసిగ్గు పడిపోయారు. ఇక యాంకర్ వర్షిణిని అదే ప్రశ్న అడిగితే ‘వండిన వంకాయ టమోటా కూరలో వంకాయ బాగుంటుందా? టమోటా బాగుంటుందా’ అని అడిగితే ఏం చెప్తాం అంటూ సెటైర్ వేసింది.

ఇక నా నోట్లో నాలులేదని అందరూ అంటారు తెలుసా? అని అమాయకంగా ఫేస్ పెట్టిన రోజాను.. నీకు నోట్లో నాలుక లేదంటే ఎవడైనా నమ్ముతాడా తల్లీ’ అంటూ మరో పంచ్ వేశారు నాగబాబు. అంటే నేను అందరిపైన నోరేసుకుని పడిపోతానా? నాగబాబుపై అలిగి రోజా కోపగిస్తే.. ‘కోపంలో కూడా నువ్ చాలా అందంగా ఉంటావ్’ అంటూ పులిహోర కలిపేస్తున్నారు నాగబాబు. వీరితో పాటు జబర్దస్త్ కమెడియన్స్ అందరూ పంచ్‌ల మీద పంచ్‌లు పేల్చుతూ ‘ఔను వాళ్లిద్దరూ గొడవపడ్డారు’లో తెగ సందడి చేశారు.

ఈ ప్రోమో చూడటం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here