RRB JE: జూనియర్ ఇంజనీర్ పోస్టుల్ని తగ్గించిన ఆర్ఆర్‌బీ

0
0



జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ముఖ్యమైన నోటీసు జారీ చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB. ముందు ప్రకటించిన ఖాళీల్లో 23 జూనియర్ ఇంజనీర్ (ప్రింటింగ్ ప్రెస్) పోస్టుల్ని తగ్గించింది ఆర్ఆర్‌బీ. చెన్నై, ముంబై, కోల్‌కతాకు కేటాయించిన పోస్టులివి. నియామక ప్రక్రియ నుంచి 23 పోస్టులు తగ్గిస్తున్నట్టు ఆర్ఆర్‌బీ అధికారిక వెల్లడించింది. మొదట 13487 జూనియర్ ఇంజనీర్ పోస్టుల్ని ప్రకటించింది ఆర్ఆర్‌బీ. అయితే ఇటీవలే కోల్‌కతా డివిజన్‌లో మరో 74 జూనియర్ ఇంజనీర్ పోస్టుల్ని చేర్చింది ఆర్ఆర్‌బీ. ఇప్పుడు 23 పోస్టుల్ని తగ్గించింది. ఇందుకు సంబంధించిన నోటీసు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైల్వేలో జూనియర్ ఇంజనీర్ పోస్టులకు మే 22 నుంచి మే 29 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 కూడా పూర్తైంది. మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను లక్షలాది మంది రాశారు. జూలై 11న ఆన్సర్ కీ రిలీజైంది. పరీక్ష రాసినవాళ్లంతా వాళ్లంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రెండో దశ సీబీటీ ఉంటుందని ఆర్ఆర్‌బీ అధికారికంగా ప్రకటించింది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ… కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే…

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు… ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి…



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here