Scholarship: విద్యార్థులకు శుభవార్త… స్కాలర్‌షిప్ కోసం నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన

0
2



విద్యార్థులకు శుభవార్త. 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇచ్చేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-NCERT సంస్థ ‘నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్’ నిర్వహిస్తోంది. నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కీమ్‌లో పీహెచ్‌డీ వరకు స్కాలర్‌షిప్ పొందొచ్చు. ఇందుకోసం రెండు అంచెల పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. ఇది మెరిట్ ఆధారంగా ఇచ్చే స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు ప్రతీ ఏటా NCERT ‘నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్’ నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతీసారి 1,000 మందికి స్కాలర్‌షిప్స్ ఇస్తుంటే ఈసారి మాత్రం 2,000 మందికి స్కాలర్‌షిప్స్ ఇవ్వనుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1,250 చొప్పున ఇంటర్ వరకు, నెలకు రూ.2,000 చొప్పున డిగ్రీ, పీజీ వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. యూజీసీ నియమనిబంధనల ప్రకారం పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ ఉంటుంది.

National Talent Search Exam 2020: దరఖాస్తు చేయండి ఇలా…

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ‘నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్’కు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆగస్ట్ 28 చివరి తేదీ. తెలంగాణలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసేందుకు ఆగస్ట్ 28 చివరి తేదీ. తెలంగాణ విద్యార్థులు bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ‘నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్’కు అప్లై చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు http://main.bseap.org/ వెబ్‌సైట్‌లో స్కాలర్‌షిప్ వివరాలు తెలుసుకోవచ్చు. ఏపీలో 10వ తరగతి విద్యార్థులు స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నవంబర్ 3న తేదీల్లో నేషనల్ టాలెంట్ సెర్చ్ మొదటి దశ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2020 మేలో రెండో దశ పరీక్ష ఉంటుంది. Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ… అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్… ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 355 ఉద్యోగాలు… ప్రాంతాలవారీగా పోస్టులివే

LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here