SSC JE Jobs: జేఈ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్

0
0



కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు సంస్థలు, మంత్రిత్వ శాఖల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి లెవెల్ 6 లో గ్రూప్ బీ(నాన్ గెజిటెడ్) పోస్టులు. వీరికి 7వ సెంట్రల్ పే కమిషన్ వర్తిస్తుంది. ఈ పోస్టుల భర్తీ కోసం కాంపిటీటీవ్ ఎగ్జామ్ SSC JE recruitment 2019 నిర్వహించనుంది. అయితే ఎన్ని ఖాళీలను భర్తీ చేయనుందో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వెల్లడించలేదు. https://ssc.nic.in వెబ్‌సైట్‌లో Candidate‟s Corner సెక్షన్‌లో Tentative Vacancy లింక్‌లో ఖాళీలను త్వరలో వెల్లడిస్తుంది. గతేడాది మాత్రం 1601 పోస్టుల్ని భర్తీ చేసింది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను https://ssc.nic.in వెబ్‌సైట్‌లో రిలీజ్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 13న ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 12 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ssc.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SSC JE recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే…

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 ఆగస్ట్ 13 దరఖాస్తు ప్రక్రియ ముగింపు: 2019 సెప్టెంబర్ 12
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్‌కు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు
ఆఫ్‌లైన్ చలానా జెనరేట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు
చలానా ద్వారా పేమెంట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 16 బ్యాంకు వేళలు ముగిసే వరకు
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్-1, పేపర్-2: పరీక్ష తేదీ వెల్లడించాల్సి ఉంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో 852 పోస్టులు… నోటిఫికేషన్ వివరాలివే

UPSC Jobs: డిఫెన్స్, నావల్ అకాడమీలో 415 ఖాళీలు… ఇంటర్ పాసైతే చాలు

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ ఉద్యోగాలు… దరఖాస్తు చేయండి ఇలా…



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here