UGC NET 2019: యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం… అప్లై చేయండి ఇలా

0
3



పీజీ పాసైనవారికి, చివరి సంవత్సరం చదువుతున్నవారికి శుభవార్త. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. యూజీసీ నెట్ ఎగ్జామ్ డిసెంబర్ 2 నుంచి 6 మధ్య జరుగుతుంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 15న జరగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA అధికారిక వెబ్‌సైట్స్ nta.ac.in లేదా ntanet.nic.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 9న ముగుస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్-JRF కోసం ప్రతీ ఏటా రెండుసార్లు యూజీసీ నెట్ నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ పరీక్ష పాసైనవారు అసిస్టెంట్ లెక్చర్‌షిప్ లేదా జేఆర్ఎఫ్ పోస్టులకు అర్హులు. కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫెరిక్, ఓషియన్, ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ రంగాలకు చెందిన విద్యార్థులు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ రాయాల్సి ఉంటుంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్‌ను మొదటిసారిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుండటం విశేషం.

NTA UGC NET December 2019: దరఖాస్తు చేయండి ఇలా…

ముందుగా అధికారిక వెబ్‌సైట్ ntanet.nic.in ఓపెన్ చేయండి. Fill Online Application Form ట్యాబ్‌పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత లాగిన్ చేసి మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయండి.
కావాల్సిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

Loading…

చివరగా పేమెంట్ చేసి submit పైన క్లిక్ చేస్తే మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
దరఖాస్తు ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్… ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో టీచర్ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

NABARD Jobs: నాబార్డ్‌లో 91 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here