UPSC Jobs: 597 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్… వివరాలివే

0
6



యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో 495, జియో సైంటిస్ట్ విభాగంలో 102 పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది UPSC. పూర్తి వివరాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(ESE) 2020 వివరాలు చూస్తే దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. ప్రిలిమినరీ ఎగ్జామ్ జనవరి 5న జరగనుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో 495 ఖాళీలున్నాయి. వాటిలో 21 పోస్టుల్ని పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసెబిలిటీస్‌కు కేటాయించారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది యూపీఎస్సీ. ఇక కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2020 వివరాలు చూస్తే మొత్తం 102 ఖాళీలున్నాయి. యూపీఎస్‌సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. యూపీఎస్‌సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

UPSC ESE 2020: ఇంజనీరింగ్ సర్వీసెస్‌ 2020 వివరాలివే…

ఇంజనీరింగ్ సర్వీసెస్‌- 495 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 15 సాయంత్రం 6 గంటలు
యూపీఎస్‌సీ ఈఎస్ఈ ప్రిలిమ్స్- 2020 జనవరి 5
వయస్సు- 21 నుంచి 30 ఏళ్లు

Loading…

విద్యార్హత- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ
పరీక్ష ఫీజు- రూ.200

UPSC ESE 2020: అప్లై చేయండి ఇలా…

ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేయండి.
‘Engineering Services (Preliminary/Stage I) Examination’ లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయండి.
పేమెంట్ చేసిన తర్వాత ఫోటో ఐడీ కార్డ్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ కాపీ అప్‌లోడ్ చేయాలి.
చివరగా సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

UPSC CGS 2020: నోటిఫికేషన్ వివరాలివే…

జియో సైంటిస్ట్ మొత్తం ఖాళీలు- 102
జియాలజిస్ట్-79
జియోఫిజిసిస్ట్-05
కెమిస్ట్-15
జూనియర్ హైడ్రాలజిస్ట్-3
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 15 సాయంత్రం 6 గంటలు
పరీక్ష తేదీ- వెల్లడించాల్సి ఉంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

CCL Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 750 ఖాళీలు… వివరాలివే

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు… దరఖాస్తు చేయండి ఇలా



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here